అల వైకుంఠపురములో సినిమాలో సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ ఆల్ టైం ఫేవరెట్ సాంగ్ గా నిలిచింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ తో ఏ ఇండియన్ సినిమా తెచ్చుకోలేని వ్యూస్ సాధించింది. వరల్డ్ లో టాప్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లో బుట్టబొమ్మ ఒకటిగా నిలిచింది. ఇక 500 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా బుట్ట బొమ్మ సాంగ్ మేకింగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఇక ఇదే కాకుండా అల్లు అర్జున్ లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రాం లో 10 మిలియన్ ఫాలోవర్స్ ను తెచ్చుకున్నారు. టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్నాడు. సౌత్ లో ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లిస్ట్ లో 10 మిలియన్స్ సాధించిన క్రేజీ హీరోగా అల్లు అర్జున్ మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి