ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నాడు. పేరుకే బ్యాక్ గ్రౌండ్ వున్న కాని అది ఎక్కడా వాడకుండా తన స్టైల్ లో సినిమాలు చేస్తూ విలువైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. తాజాగా నటిస్తున్న గని సినిమా కోసం ఎంతో కష్టపడి టోనీ జెఫ్రీస్ దగ్గర బాక్సింగ్ ట్రైనింగ్ తీస్కుని మరీ గని గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో గని పంచ్ పవర్ కి ఎవరైనా గులామ్ అనాల్సిందేనట. గని బరిలోకి దిగితే పని అయిపోయినట్లే అన్నట్లుగా ఉంటుందని, దీనికోసం వరుణ్ చాలా కష్టపడ్డాడని చెప్తోంది చిత్రబృందం.

బాక్సర్ రోల్  కోసం తనని తాను బాగా మార్చుకొని, ఇందులో వరుణ్ కి పోటీగా నవీన్ చంద్ర కూడా మెప్పిస్తాడని అంటున్నారు. అంతేకాదు, కేవలం బాక్సింగ్ నేపథ్యంలోనే కాకుండా ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయని అంటున్నారు. గతంలో వచ్చిన ఏ తెలుగు సినిమాకి కూడా ఈ సినిమాతో పోలిక ఉండదని, కథని చాలా కొత్తగా చూపించేశామని అంటోంది చిత్ర బృందం. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మకంగా వున్నారు.

ఈ సినిమాలో ఎవరి ఆటలు అయినా సరే కట్టించేందుకు గని బాక్సింగ్ రింగ్ లోకి దిగుతాడని, ఈ సీన్స్ చాలా బాగా సిల్వర్ స్క్రీన్ పై వచ్చాయని సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆత్మవిశ్వాసంతో వున్నారు చిత్ర బృందం వారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: