
రఘువరన్
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో రఘువరన్ విలనిజం బాగా ఎలివేట్ అయ్యేది. శివ సినిమాతో పాటు అనేక సినిమాల్లో తన డైలాగ్స్ తోనే వణుకు పుట్టించాడు. రఘువరన్ తెలుగు నటి రోహిణిని వివాహం చేసుకున్నాడు. ఒక బాబు పుట్టాక ఇద్దరు విడిపోయారు.
2008 లో గుండెపోటుతో మరణించాడు.
పరేష్ రావల్
రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో వచ్చిన గోవిందా గోవిందా, క్షణ క్షణం వంటి సినిమాల్లో పరేష్ రావల్ ఒక ప్రతేకమైన మ్యానరిజంతో అదరగొట్టారు.
అమ్రిష్ పురి
సినిమాల్లో అమ్రిష్ పురి రూపాన్ని చూస్తే పిల్లలు దడుచుకుంటారు. ఒక్కోసారి అమ్రిష్ పురిని చూసి పెద్దవారు కూడా భయపడతారు. అమ్రిష్ పురి కళ్ళెర్ర చేసి డైలాగ్ చెప్పితే వణుకు రావాల్సిందే.
రావు గోపాలరావు
రావు గోపాలరావు సరికొత్త ఊతపదాలతో విలన్ గా అలరించాడు. ఆ రోజుల్లో సినిమాలో రావు గోపాలరావు ఉన్నదంటే ఖచ్చితంగా ఊతపదం ఉండాల్సిందే. రావు గోపాలరావు ఊతపదాలు సినిమా వచ్చి ఎన్ని రోజులు అయినా ఆలా గుర్తుండిపోయేలా ఉండేవి.
రామిరెడ్డి
రామిరెడ్డి సాంఘిక సినిమాల్లోనే కాకుండా భక్తి సినిమాల్లో కూడా విలన్ గా నటించి మెప్పించాడు. భక్తి సినిమాల్లో విలన్ గా బాగా సెట్ అయ్యాడు.
టైగర్ ప్రభాకర్
చాలా స్టైల్ గా,జీర గొంతుతో విలనిజాన్ని తనదైన శైలిలో పండించి హీరోలకు ధీటుగా నటించి మెప్పించాడు.
నాజర్
మొదట్లో నాజర్ నెగిటివ్ రోల్స్ ఎక్కువగా చేసేవాడు. ఇప్పుడు విలన్ రోల్ చేసిన కొన్ని పాజిటివ్ రోల్స్ కూడా చేసి మెప్పిస్తున్నాడు.
కోట శ్రీనివాసరావు
కోట శ్రీనివాస రావు పోషించని రోల్ అంటూ లేదు. నవ్వించారు.. ఏడిపించారు. భయపెట్టటారు కూడా. గణేష్ చిత్రంలో విలనిజాన్ని కొత్తగా చూపించారు.
శ్రీహరి
శ్రీహరి చాలా సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యాక విలన్ పాత్రలకు గుడ్ బై చెప్పేసాడు.
మోహన్ బాబు
మోహన్ బాబు చాలా సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యాక కూడా అప్పుడప్పుడు విలన్ గా కూడా అభిమానులను అలరిస్తున్నాడు.
కైకాల సత్యనారాయణ
ఎన్టీఆర్ కాలం నుంచే కైకాల సత్యనారాయణ నెగటివ్ క్యారెక్టర్స్ ని ఓ ఆట ఆడుకున్నారు..ఇక ప్రస్తుతం ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు...!!