టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అంటూ అభిమానులు ఎదురు చూస్తుంటే గౌతమ్ అభిరుచులు మాత్రం వేరే విధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భాగ్యనగరంలోని ఒక ప్రముఖ అంతర్జాతీయ స్కూల్ లో చదువుకుంటున్న గౌతమ్ లో ఎవరు ఊహించని టాలెంట్ బయటకు వచ్చింది.


తెలంగాణ స్టేట్ స్విమింగ్ కార్పోరేషన్ ప్రకటించిన 16 సంవత్సరాల లోపు టాప్ స్విమర్స్ లిస్టులో గౌతమ్ కు స్థానం లభించిన విషయాన్ని నమ్రత తెలియచేస్తూ తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేసింది. నమ్రత గౌతమ్ గురించి లీక్ చేసిన ఈ న్యూస్ క్షణాలలో వైరల్ గా మారింది.


ఇప్పటి వరకు గౌతమ్ ను కేవలం మహేష్ కొడుకుగా అదేవిధంగా ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తిస్తూ ఉంటారు. అయితే గౌతమ్ గత నాలుగు సంవత్సరాలుగా స్విమింగ్ లో బాగా రాణిస్తున్నాడు అన్న విషయం బయటపడింది. గౌతమ్ ప్రస్తుతం ఆయుష్ యాదవ్ దగ్గర స్విమింగ్ లో అనేక టెక్నిక్స్ నేర్చుకుంటున్నాడట.


ఒక ప్రోఫిషనల్ స్విమ్మర్ గా మారాలని గౌతమ్ కోరిక అని తెలుస్తోంది. స్విమింగ్ కు సంబంధించిన బటర్ ఫ్లయ్ – బ్యాక్ స్ట్రోక్ – బ్రెస్ట్ స్ట్రోక్ – ఫ్రీ స్టైల్ విభాగాలలో గౌతమ్ ఇప్పటికే తన ప్రతిభను మెరుగు పరుచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గౌతమ్ 3 గంటలపాటు స్విమ్ చేయగలడని నమ్రత చెపుతోంది. గౌతమ్ ప్రతిభ ఇలాగే కొనసాగితే అతడు దేశంలో మంచి ర్యాంకింగ్ పొందిన స్విమ్మర్ గా మారే ఆస్కారం ఉంది. గతంలో నాగార్జున కొడుకు అఖిల్ కూడ ఇలాగే క్రికెటర్ బాగా రాణించాడు. అయితే చాలామంది అఖిల్ మంచి క్రికెటర్ అవుతాడు అని భావిస్తున్న తరుణంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు గౌతమ్ కూడ ఇలాగే భవిష్యత్ లో తన అభిరుచులు మార్చుకుని తండ్రి సినిమా కరియర్ ను ఎంచుకుంటాడ లేదంటే ప్రోఫిషనల్ స్విమ్మర్ గా మారుతాడా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: