ప్రస్తుతం సోషల్
మీడియా బాగా పెరిగిపోవడంతో సినిమా షూటింగ్ లకు సంబంధించిన అప్డేట్ లు ఎప్పటికప్పుడు మనకు వచ్చేస్తున్నాయి. ఫోన్లోనే ప్రపంచ తెలుస్తుంది కాబట్టి చీమ చిటుక్కుమన్నా
సినిమా ఇండస్ట్రీ విషయాలు అన్నీ తెలిసి పోతున్నాయి. అయితే గతంలో అలా కాదు అప్పుడు
సినిమా షూటింగ్ లు తెలియాలంటే ప్రత్యేకగా షూటింగ్ కు వెళ్లి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విధంగా జయం
సినిమా లో జరిగిన ఓ ప్రమాదం అలా మరుగున పడిపోయింది. తాజాగా 19 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదం గురించి బయటపడింది.
నితిన్ హీరోగా పరిచయమైన ఈ సినిమాకు దర్శకుడు తేజ దర్శకత్వం వహించగా
సదా హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ప్రేమకథా చిత్రాల్లో ఒక ట్రెండ్ ను సృష్టించిన ఈ
సినిమా భారీ హిట్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా కొత్తగా మరో 40 మంది నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో నితిన్ కి యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో భారీ ప్రమాదం జరిగిందట. ఆ విషయాన్ని
హీరోయిన్ సదా చెప్పింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన
యాక్సిడెంట్ గురించి ఓపెన్ అయింది సదా.
నెల్లూరు సమీపంలో రోజు ఓ అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు షూటింగ్ చేసాము. దాని కోసం రోజుకు కొన్ని కిలోమీటర్లు సుమోలో నితిన్
సదా తో పాటు మరో ఇద్దరు కూడా వెళ్లే వాళ్ళు. అయితే ఓరోజు అడవి మధ్యలో ఉన్నట్లుండి టైర్ పేలిపోయింది. దాంతో వారు ప్రయాణిస్తున్న సుమో మూడు పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఆ సమయంలో తను చని పోతానేమో అని తెలిపింది. అది నిజంగానే భయంకరమైన సంఘటన అన్నది సదా. పైకి లేవడానికి చూస్తున్న కూడా కుదరడం లేదని తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఈ
యాక్సిడెంట్ ఘటన తలుచుకుంటే నిద్ర కూడా రాదు అని ఆ సంఘటన గురించి వివరించింది. అయితే ఇంత పెద్ద ప్రమాద ఘటన గురించి ఇప్పటి వరకు ఎక్కడ పంచుకోలేదు నితిన్.