చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే లక్షల మంది మృతి చెందగా.... మరికొంత మంది అనారోగ్యం పాలయ్యారు. ఇక ఈ వైరస్ కారణంగా సినిమా మరియు క్రీడా రంగం తీవ్రంగా ముఖ్యంగా సినిమా రంగం విషయానికి వస్తే.... షూటింగ్ చాలా మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. అలాగే థియేటర్లు మూత పడటంతో.... సినిమా నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని సంతోష పడుతున్న.... తరుణంలో థర్డ్ వేవ్ వస్తుందని ఆందోళన కూడా మొదలైంది. దీంతో సినీ నిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫామ్ నే నమ్ముకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నాని నటించిన... టక్  జగదీష్ సినిమాను కూడా పోటీలో రిలీజ్ చేయడానికి ఈ సినిమా బృందం రెడీ అయినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే టక్ జగదీష్.... రిలీజ్ తేదీపై ఇంకా చిత్రబృందం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా చిత్ర బృందం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా టక్ జగదీష్ సినిమా లో  నాని హీరోగా నటించగా పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా శివ నిర్వాణ డైరెక్షన్ లో  వస్తుండగా.... నిర్మాతలుగా సాహూ గారపాటి మరియు హరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  జగపతిబాబు, నాజర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, దేవదర్శిని మరియు రావు రమేష్ లాంటి ప్రధాన పాత్రలు ఈ సినిమాలో కనిపించనున్నాయి. కాగా ఏప్రిల్ 23 న ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికి... కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: