
కరోనా కారణం గా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ని పెంచి పోషిస్తున్నాయి ఓ టీ టీ సంస్థలు. లాక్ డౌన్ కారణంగా థియేటర్ లు మూత పడిపోవడంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఎలా విడుదల చేసుకోవాలి అన్న భయంతో కొట్టుమిట్టాడారు. ఈ నేపథ్యంలోనే వారికోసం దైవం లా అవతరించాయి ఓటీపీ సంస్థలు. ప్రపంచంలోని అగ్రగామి ఓటీటీ సంస్థలు అయినా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంస్థలే కాకుండా ప్రాంతీయంగా కూడా కొన్ని సంస్థలు వెలువడ్డాయి. వాటి ద్వారా నిర్మాతలు తమ సినిమాలను ప్రేక్షకులకు చూపిస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.
ఇకపోతే అమెజాన్ ప్రైమ్ టాలీవుడ్ కి ఏమాత్రం కలిసి రావట్లేదని గత కొన్ని రోజులుగా అందరూ గుసగుసలాడుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలతో పాటు సినిమాలను సైతం కొనుగోలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది. అయితే వీటిలో విడుదలైన తెలుగు సినిమాలు ఏవి భారీ హిట్ కొట్టక పోవడంతో అందరూ ఈ రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సినిమాలు అన్ని ఫ్లాప్ కావడమే ఈ తరహా టాక్ రావడానికి కారణం.
మొదటి నుంచి గమనిస్తే నాని హీరోగా నటించిన వి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశబ్దం సినిమాలు అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కాగా ఆ సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు. కానీ ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్, ఇటీవలే వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో వచ్చి మంచి పేరును తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ సినిమా రిలీజ్ చేస్తే సినిమా ఫ్లాప్ అన్న అపోహ తొలగిపోవాలని కొంత మంది విశ్లేషకులు చెబుతున్నారు. ముందు ముందు అమెజాన్ లో నాని టక్ జగదీష్ వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.