ఇండియన్
సినిమా చరిత్రలో ఎంతోమంది దర్శకులు ఎన్నో గొప్ప గొప్ప హిట్ చిత్రాలు తెరకెక్కించి గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఆ విధంగా దక్షిణాదిన కూడా చాలా మంది దర్శకులు ప్రేక్షకులను మెప్పించే సినిమాలను తెరకెక్కించారు. కొన్ని సినిమాలు కమర్షియల్ గా పెద్ద పేరుని తెచ్చుకోకపోయినా కూడా మంచి సినిమాలు గా సినీ చరిత్రలో నిలిచిపోయేవి ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు కమర్షియల్ గా భారీ వసూళ్లు సాధించి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.
తమిళ సినిమా పరిశ్రమలో మంచి పేరున్న దర్శకుడిగా పా రంజిత్ నిలిచిపోతాడు.
కబాలి కాలా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైన ఈ దర్శకుడికి ఏ దర్శకుడికి లేని ఐడియాలజీ ఉంది కానీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ అవడంతో దర్శకుడిగా తనని తాను ఎలివేట్ చేసుకోలేక పోతున్నాడు. తన ప్రతి సినిమాలో తన ఐడియాలజీ ని బలంగా చాటే ప్రయత్నం చేస్తాడు రంజిత్. ఆయన దళితుడు అన్న సంగతి
కోలీవుడ్ లో అందరికీ తెలుసు. తన సినిమాల ద్వారా కాకుండా బయట కూడా దళిత భావజాలాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఆయన తొలి
సినిమా ఆట
కత్తి , ఆ తర్వాత చేసిన
మద్రాస్ పూర్తిగా దళిత కాలనీల నేపథ్యంలోనే సాగుతాయి. వారి పై జరిగే ఆకృత్యాలు వారి పోరాట నేపథ్యంలోనే ఆయన ఇప్పటి వరకు చేసిన ప్రతి
సినిమా ఉంది.
కబాలి కాలా వంటి సినిమాలల సైతం ఆయన దళిత భావజాలాన్ని నింపి
సినిమా ప్రేక్షకులకు బాగా అర్థం కావడానికి తోడ్పడ్డాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సార్పట్ట
సినిమా కూడా ఇదే కోవలోకి చెందిన సినిమా.
హీరో పెళ్లి టైంలో అతడికి అంబేద్కర్ ఫోటో ను బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆ విషయాన్ని చెప్పకనే చెబుతాడు. కుల వివక్ష గురించి పరోక్షంగా చర్చ ఉంటుంది ఆయన
సినిమా ల్లో. దర్శకుడిగానే కాదు కుల వ్యవస్థ మీద నిర్మాతగా పరియేరుం పెరుమాళ్ అనే
సినిమా కూడా నిర్మించాడు.