అక్కినేని హీరో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా సెప్టెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమాకి ప్రతీ ఒక్కరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా ఇది. ఇక వరల్డ్ వైడ్ గా సుమారు 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఎవ్వరూ ఊహించని ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని ఏకంగా 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 16.5 కోట్ల మార్క్ గ్రాస్ ని అందుకున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాకి మొదటి రోజు ఏరియాల వారిగా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి...
Nizam : 3.06Cr
Seeded   : 1.08Cr
UA : 61L
East     : 48L (14 L Hires)
West      : 55 L(24L Hires)
Guntur : 59L(16 L Hires)
Krishna: 32L
Nellore : 25L
AP-TG Total:- 6.94CR(10.35CR~ Gross)(54L hires)
Ka+ROI: 32L~
OS - 2.40Cr~
Total WW: 9.66CR(16.5CR~ Gross)

ఇక ఈ సినిమాకి టోటల్ గా 31.2 కోట్ల బిజినెస్ జరిగింది.దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.ఇక మొదటి రోజు కలెక్షన్స్ ని తీసేస్తే ఇంకా 22.34 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది.ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా మరో రికార్డ్ ని సైతం కొల్లగొట్టింది.ఇంతవరకు ఏ ఒక్క ఇండియన్ సినిమా కూడా కలెక్ట్ చేయని మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంది లవ్ స్టోరీ చిత్రం.ఇక అమెరికాలో ప్రీమియర్స్ పరంగా 2021 లో ఏ సినిమాకు రాని కలెక్షన్స్ లవ్ స్టోరీ సినిమాకు వచ్చినట్లు తెలుస్తోంది.ఇక దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ని సైతం చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.ఇక దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.మొత్తం మీద నాగ చైతన్య కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ ని ఆ అందుకున్న సినిమాగా లవ్ స్టోరీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది.దీంతో లవ్ స్టోరీ మూవీ యూనిట్ ఇప్పుడు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో బిజీగా వుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: