బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎంతో మంది నటీ నటులకు అవకాశాలు కల్పించింది.ఇప్పటికే ఈ షో ద్వారా చాలామంది ఆర్టిస్టులు ఫేమస్ అయ్యారు.ఇక బిగ్ బాస్ నుండి తిరిగి వచ్చాక వాళ్లకు ఆఫర్స్ కూడా క్యూ కడుతుంటాయి.అందుకే ఈ షో కి వెళ్ళడానికి తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఐదవ సీజన్లోకి ఎంటర్ అయ్యింది.ఇక ఈ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.వారిలో నటి శ్వేతా వర్మ కూడా ఒకరు..ది రోజ్ విల్లా,ముగ్గురు మొనగాళ్ళు, పచ్చిస్, సైకిల్ వంటి సినిమాలతో పాటు పలు వెబ్ సీరీస్ లలో నటించింది శ్వేతా. 

కానీ ఈమెకి ఆశించినంత గుర్తింపు రాలేదు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ అందుకొని ఇంట్లో అడుగుపెట్టిన శ్వేత.. తన ఆట తీరులో స్ట్రాంగ్ అని నిరూపించుకుంది.తను అనుకున్న మాటలను ముక్కు సూటిగా చెప్పడం, ఇతరుల తప్పులను వేలెత్తి చూపడంలో శ్వేతా ముందుంటుంది.అలాగే టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తూ..హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది.ఇక సీజన్5 లో మంచి పాపులారిటీ,ఫాలోయింగ్ ని సంపాదించుకున్న శ్వేత.. అనూహ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యింది.దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు.ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం శ్వేత వర్మ బిగ్ బాస్ షో కి తీసుకున్న రెమ్యునరేషన్ గురించి..

 సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది.దాదాపు ఆరు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్వేతా వర్మకి ఎంత రెమ్యునరేషన్ వచ్చిందనేది ఇప్పుడు నెట్టింట్లో జరుగుతున్న చర్చ.ఇక తాజా సమాచారం ప్రకారం..శ్వేతా వర్మకి వారానికి గానూ రూ.60 నుండి 90 వేల వరకు ఇస్తున్నారట.ఆమె ఆరు వారాల పాటు బిగ్ బాస్ హౌజ్ లో ఉంది.ఆ లెక్కన చూసుకుంటే ఆమెకి ఆరు వారాలకు సుమారు 5 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఆరవ వారానికి గానూ ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మకి ముందు ముందు ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: