- లోకేష్‌కు అనుకూలంగా వార్ వ‌న్‌సైడే
- ప్ర‌చారంలో లావ‌ణ్య ముందే చెప్పేస్తోన్న జనం..
- బ్రాహ్మ‌ణి వ‌చ్చాక టీడీపీకి మ‌రింత ప్ల‌స్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైసీపీ యువ నాయ‌కురాలు, బీసీ నేత మురుగుడు లావ‌ణ్య‌కు మంగ‌ళ‌గిరిలో కొంద‌రు మ‌హిళ‌లు షాకిచ్చా రు. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంగ‌ళ‌గిరి నుంచి పోటీకి దిగిన రాజ‌కీయ కుటుంబానికి చెందిన లావ ణ్య‌..  గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతు న్నారు. మ‌హిళ‌ల‌కు బొట్టు పెట్టి మ‌రీ.. త‌నకు ఓటేయాల‌ని అభ్య‌ర్థించారు. అయితే.. కొంద‌రు మ‌హిళ‌లు సానుకూలంగా స్పందించినా.. మ‌రికొన్ని చోట్ల మాత్రం వ్య‌తిరేక‌త వ‌చ్చింది. తాము నారా లోకేష్‌కే ఓటేస్తామ‌ని మొహం మీదే చెప్పేశారు.


దీంతో వైసీపీ అభ్య‌ర్థి లావ‌ణ్య షాక‌య్యారు.  ఇలా అన్న‌వారితో ఎలాంటి వాద‌న పెట్టుకోకుండా.. ఆలోచించండ‌మ్మా! అంటూ.. అక్క‌డ నుంచి వెళ్లిపోతున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్‌ మీడియాలో హ‌ల్చ‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు.. లావ‌ణ్య మాతృమూర్తి, రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే  కాండ్రు క‌మ‌ల‌, లావ‌ణ్య మామ‌గారు.. రెండు సార్లు గెలిచిన‌ మురుగుడు హ‌నుమంత‌రావు కూడా విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ.. ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత మంది ప్ర‌చారంలో ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గాన్న ఇఅభివృద్ధి చేశామ‌న్నా.. లావ‌ణ్య‌కు మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు.


ఏం జ‌రిగిందంటే..
ప్ర‌చారంలో భాగంగా మురుగుడు లావ‌ణ్య తాజాగా మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంటికి వెళ్లిన లావ‌ణ్య అక్క‌డి మ‌హిళ‌ను త‌న‌కు ఓటేసి గెలిపించాల‌ని కోరారు. అయితే.. త‌మ‌కు నేత‌న్న నేస్తం నిధులు రెండు ద‌ఫాలుగా రాలేద‌ని.. అనేక సార్లు అర్జీలు పెట్టినా.. ఇస్తామ‌ని ఇవ్వ‌లేద‌ని చెప్పారు. దీంతో లావ‌ణ్య స్పందిస్తూ.. నాకు ఓటేసి గెలిపించండి..నేను మీకు అందుబాటులోనే ఉంటాను. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు.


దీనికి  ఆమె.. స్పందిస్తూ.. ఆ అవ‌స‌రంలేదు.. మేం లోకేష్‌కే ఓటేస్తాం.. ఆయ‌న‌పైనే న‌మ్మ‌కం ఉంది.. అని మొహంమీదే చెప్పేశా రు. దీంతో లావ‌న్య ముఖం చిన్న బోయింది. ఆలోచించ‌మ్మా! అంటూ.. అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డిపోయింది. పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ఉంద‌ని అనుకున్నా.. నారాలోకేష్‌, బ్రాహ్మ‌ణిల ప్ర‌చారంతో ఇక్క‌డ వ్యూహం మారుతోంద‌ని తెలుస్తోంది. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గంలో కుదుపులు మొద‌ల‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: