ఎటువంటి రాజకీయ పార్టీ కైనా సరే ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది కీలకమైన అంశంగా ఉంటుంది.. ముఖ్యంగా మ్యానిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నమ్మేప్రజలు ఎక్కువగా నాయకుడి పైన నమ్మకాలను పెట్టుకొని మరి ఓటేస్తూ ఉంటారు.. అయితే అలాంటి మేనిఫెస్టోలో ఒక్క హామీ ఇచ్చామంటే ఖచ్చితంగా దానిని నెరవేర్చే నమ్మకాన్ని నిలబెట్టుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అయితే అలాంటి పరిస్థితులు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. కేవలం అధికారం కోసమే పలు రకాల అడ్డగోలు హామీలను సైతం చాలామంది నేతలు ఇస్తున్నారు.



తీర ఎన్నికలలో గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడంలో చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లోని టిడిపి మేనిఫెస్టో పరిస్థితి కూడా అలాగే మారింది.. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్తున్నటువంటి హామీలను వింటే ఎవరైనా సరే టెంప్ట్ అయ్యేలా ఉన్నది.. అయితే అవన్నీ ఎంతవరకు నెరవేసిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


అసలు విషయంలోకి వెళ్తే బీసీ మహిళలకు పెన్షన్ ఇవ్వాలి అంటే దాదాపుగా చంద్రబాబు మేనిఫెస్టో ప్రకారం 30 నుంచి 32 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది.. వీరికి నెలకు 4000 చొప్పున దాదాపుగా 1,400 కోట్ల రూపాయలు కావాలి.. అలాగే నిరుద్యోగ యువతకు ₹3,000 ఇవ్వాలంటే కనీసం 20 లక్షల మందికైనా ఇవ్వాలి.. అది ఒక 600 కోట్లు.. ఉద్యోగస్తుల జీతభత్యాలు పెన్షన్తో కలిపి సుమారుగా 4,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.. వాలంటరీల విషయానికి వస్తే 2,65,000 మంది ఉన్నారు.. కాబట్టి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 265 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.. మిగిలిన మహిళలు 18 నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నవారు నెలకి రూ.1500 చొప్పున ఇస్తే 80 లక్షల రూపాయలు ఖర్చవుతుందట.. వీటితో పాటు మరిన్ని పథకాలు ఇతరత్రా వాటిని కలుపుకొని సుమారుగా ప్రతినెల 1వ తారీకు రూ.13,200 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉండాలి..


అలాగే ఆరోగ్యశ్రీ ,అంగన్వాడీ పిల్లలక భోజనం, స్కూల్లో మధ్యాహ్నం భోజనం, విద్యా దీవెన, వసతి దీవెన.. నాడు నేడు పనులు ఇవి కాకుండానే కేవలం ప్రతినెల రూ.13,200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. అలాగే వైసిపి పార్టీ మేనిఫెస్టో గతంలో చెప్పినట్టుగానే చేసినప్పటికీ ఈసారి కేవలం మూడు పథకాలలో మాత్రమే పెంచడం జరిగింది.. ఒకవేళ జగన్ చెబితే కచ్చితంగా చేస్తారని ఎస్కేప్ అయ్యే సందర్భాలు కూడా ఎక్కడ కనిపించలేదనీ ప్రజలు నమ్ముతున్నారు.. అందుకే చంద్రబాబు మేనిఫెస్టో కన్నా జగన్ పైన ఎక్కువగా ప్రజలు నమ్మకాన్ని పెట్టుకున్నారు.. చంద్రబాబు మేనిఫెస్టో వల్ల ఇవన్నీ సాధ్యమయ్యే పథకాలు కాదనే విషయంగా వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో కూడా చంద్రబాబునాయుడు ఇచ్చిన 650 హామీలలో నెరవేర్చకపోవడం వల్లే ఇప్పుడు మేనిపొస్ట్ విషయం పైన దెబ్బ పడుతోంది. దీన్నిబట్టి చూస్తే ఈ మేనిఫెస్టో వల్లే సైకిల్ రివర్స్లో వెళ్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.. మరి ఎవరి మేనిఫెస్టో అధికారాన్ని చేజిక్కించుకునేలా చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: