ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో వేమూరు ఒకటి. ఇకపోతే ఎస్సీ రిజర్వుడ్ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం పై పార్టీ నాయకులు కూడా అత్యంత శ్రద్ధ వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సారి వేమూరు నియోజక వర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున వరికూటి అశోక్ కుమార్ పోటీ చేస్తూ ఉండగా ... కూటమి నుండి ఈ ప్రాంతం నుండి నక్క ఆనంద్ బాబు పోటీలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో నక్క ఆనంద్ బాబు తమ సమీప అభ్యర్థి అయినటువంటి మెరుగు నాగార్జున పై భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఇక ఆ తర్వాత జరిగిన 2019 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇక్కడి టీడీపీ అభ్యర్థిగా నక్క ఆనంద్ బాబు సీట్ ను దక్కించుకున్నాడు. అందులో భాగంగా 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఈయన తన సమీప అభ్యర్థి అయినటువంటి మెరుగు నాగార్జున పై ఓడిపోవడం జరిగింది. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా వేమూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈయన ఒక దాంట్లో గెలుపొంది , మరో దాంట్లో ఓడిపోయాడు.

అయినప్పటికీ ఈయన ఇదే ప్రాంతంలో ఉంటూ ఇక్కడి ప్రాంతాల జనాలతోనే కలిసి ఉండటంతో ఈయనకు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఇకపోతే అశోక్ కుమార్ వేమూరు నియోజక వర్గం నుండి మొదటి సారి పోటీలోకి దిగుతున్నారు. అయినప్పటికీ ఈయన అధికార పార్టీ వ్యక్తి కావడంతో అశోక్ కి కూడా క్యాడర్ బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దానితో ఈయనకు కూడా ఈ ప్రాంతంలో మంచి పట్టే ఉండే అవకాశం ఉంది.

ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది , మరోసారి ఓడిపోయి ఇప్పుడు కూడా సీట్ ను దక్కించుకున్నాడు అంటే ఈయనకు ఈ ప్రాంతంలో మంచి క్రేజ్ ఉండడం తోనే కూటమి ఈయనకు సీట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అశోక్ కుమార్ ను వెతికి మరి వైసీపీ టికెట్ ఇచ్చింది అంటే ఈయనకు కూడా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని వైసీపీ నాయకత్వం నమ్మి ఉంటుంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు.  మరి ఈ ప్రాంతంలో సీనియర్ అయినటువంటి ఆనంద్ బాబు ఈ సారి గెలుస్తాడా ..? లేక కొత్త వ్యక్తి అయినటువంటి అశోక్ కుమార్ గెలుపును అందుకుంటాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nab