మరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు అనేక రకాల పథకాలను అధికారంలోకి వస్తే అమలు చేయనున్నట్లు ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గలలో రేపల్లె నియోజకవర్గం ఒకటి. ఈసారి రేపల్లె నియోజకవర్గం యొక్క వైసీపీ సీటును ఈవూరు గణేష్ దక్కించుకోగా ... కూటమి అభ్యర్థిగా అవగాని సత్యప్రసాద్ ఇక్కడి నుండి సీటును దక్కించుకున్నాడు.

ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 2014 వ సంవత్సరం లో తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసిన అవగణిత సత్య ప్రసాద్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుపొందాడు. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈయన టీడీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి కూడా విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు సార్లు టీడీపీ నుండి పోటీ చేసి గెలిచినా ఈయన మూడవ సారి కూడా ఈ ప్రాంతం టీడీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగారు.

ఇక ఇప్పటికే ఈ ప్రాంతంలో రెండు సార్లు వరుసగా గెలుపొందిన వ్యక్తి కావడంతో ఈయనకు రేపల్లె నియోజ కవర్గం లో అదిరిపోయే రేంజ్ క్యాడర్ ఉంది. అలాగే జనాల్లో కూడా మంచిపట్టు ఉంది. ఇక ఈవూరి గణేష్ కొత్తగా పోటీ చేస్తున్నాడు. మరి అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఈయనకు కూడా మంచి క్యాడర్ ఈ ప్రాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలా రేపల్లె నియోజకవర్గం లో ఒకవైపు వరుసగా రెండు సార్లు గెలుపొందిన సత్యప్రసాద్ వైపు కొంత శాతం బలం కనబడుతూ ఉండగా ... కొత్త వ్యక్తి అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తి కావడంతో గణేష్ వైపు కూడా కొంత బలం ఉండే అవకాశాలు ఉన్నాయి. దానితో ఇక్కడ గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దానితో ఈ ప్రాంతంలో ఎవరు గెలుస్తారో అనేది సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

asp