ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి టీజీ భరత్, వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తుండటంతో కర్నూలు కింగ్ ఎవరనే చర్చ మొదలైంది. టీజీ భరత్, ఇంతియాజ్ లలో గెలిచే అభ్యర్థి ఎవరంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అయితే అటు టీజీ భరత్ , ఇంతియాజ్ లలో ఎవరి బలాలు ఎవరి బలహీనతలు వారికి ఉన్నాయి.
 
ఏపీ ఓల్డ్ కేపిటల్ లో గెలుపెవరిది అనే చర్చ జరుగుతుండగా వైసీపీ మైనార్టీ వర్సెస్ టీడీపీ వైశ్య అభ్యర్థుల మధ్య ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరికి సొంతమవుతుందో చూడాల్సి ఉంది. గత ఎన్నికల్లో టీజీ భరత్ 5 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
 
టీజీ భరత్ బలాలు :
 
నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడం
 
కర్నూలు ప్రజల సమస్యలపై అవగాహన ఉండటం
 
ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడం
 
అర్బన్ ఓటర్లు టీడీపీకి అనుకూలంగా ఉండటం
 
బలహీనతలు :
 
ముస్లిం ఓటర్ల మెప్పు పొందలేకపోవడం
 
పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడం
 
మరోవైపు గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా గెలవగా ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇంతియాజ్ కు టికెట్ దక్కింది. మైనార్టీల ఓట్లతో మరోసారి వైసీపీకి అధికారం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.

ఇంతియాజ్ బలాలు :
 
నియోజకవర్గంలో జగన్ అనుకూల ఓటర్లు ఎక్కువగా ఉండటం
 
ముస్లిం ఓట్లు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండడం
 
ఐఏఎస్ అధికారిగా పని చేసిన అనుభవం
 
ఇంతియాజ్ బలహీనతలు :
 
ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడం
 
కర్నూలు సమస్యల గురించి అవగాహన లేకపోవడం
 
కర్నూలు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే కచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. టీజీ భరత్, ఇంతియాజ్ లలో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే అధికారం సాధించే ఛాన్స్ అయితే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: