తెలుగు సినీ చరిత్రను మరింత గొప్పగా మలిచిన చిత్రాలలో "సోగ్గాడే చిన్ని నాయన" కూడా ఒకటి. 2017 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున డ్యుయల్ రోల్ చేసి రెండు సరి కొత్త పాత్రలలో అందర్నీ ఆశ్చర్యపరిచారు. బంగార్రాజు (నాగార్జున) భార్యగా నటించిన రమ్య కృష్ణ మరో సారి  ప్రేక్షకుల్ని తన నటనతో, అభినయంతో సర్ప్రైజ్ చేశారు. గ్లామర్ కి గ్లామర్... రాజసానికి రాజసం ఇలా అన్నిటినీ కలగలిపిన రమ్య కృష్ణ తరగని అందంతో ఇప్పటికీ అంతే అందంతో ఎవర్గ్రీన్ లా ఆకర్షిస్తున్నారు.

రికార్డులు సృష్టించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా సక్సెస్ కి రమ్యకృష్ణ నటన కూడా కారణమయ్యింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బంగార్రాజు భార్యగా అలాగే రాము తల్లిగా రమ్యకృష్ణ మంచి నటనను కనబరిచి తన పాత్రకు 100% న్యాయం చేశారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బొమ్మ అదిరింది నాయనా అంటూ చిందులు వేశారు. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రమ్య కృష్ణ ప్రస్తుతం సెలెక్టివ్ గా పాత్రల్ని ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన జోరును చూపిస్తున్నారు.

ఇటీవలే రమ్యకృష్ణ దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత బ‌యోపిక్ 'క్వీన్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా రిపబ్లిక్ మూవీలో ఒక పొలిటికల్ లీడర్ గా నటించి అందరి మెప్పు పొందింది. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ చాలా బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: