మొన్నటి వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంత ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. అయితే నాగచైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు. ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ తో ఉండే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం అందరూ సోషల్ మీడియా వేదికగా తెగ వెతకడం ప్రారంభించారు. అయితే వీళ్లు విడాకులు తీసుకుని రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో ఇక ఇదే అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇక విడాకుల తర్వాత సమంత పెడుతున్న ప్రతి పోస్ట్ కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే విడాకుల తర్వాత కూడా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. కానీఅటు నాగచైతన్య మాత్రం ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు కాస్త ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ప్రేమించిన వారి కోసం ఏడవాలి తప్పదు కదా అంటూ నాగచైతన్య వ్యాఖ్యానించాడు.  నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.



 ఈ క్రమంలోనే ఇక ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు లో ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇంటర్వ్యూ లో భాగంగా  సాయి పల్లవి మీకు చెంప మీద ముద్దు పెడితే ఎందుకు ఏడ్చారు..  ఆ మాత్రం దానికి ఏడుస్తారా అటు అని ప్రశ్నించగా.. ప్రేమిస్తే ఏడవాలి కదా ప్రేమించిన వారి కోసం తప్పదు అంటూ నాగచైతన్య సమాధానం చెప్పాడు. అయితే నాగచైతన్య చెప్పిన ఈ సమాధానం లవ్ స్టొరీ లోని సన్నివేశం గురించి అయినప్పటికీ. ఇక ఇది చూసిన అభిమానులు మాత్రంనిజ జీవితంతో ఇక ఈ డైలాగ్ను కనెక్ట్ చేసుకుంటున్నారు. సమంత గురించే నాగచైతన్య ఈ డైలాగ్ చెప్పాడు అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: