ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న అన్నీ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో నే ఉంటున్నాయి. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హీరోయిన్ గా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాలో సంక్రాంతి పండుగ కానుకగా ధియేటర్స్ లో గ్రాండ్ గా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాలు గా ప్రభాస్ అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారు అంటేనే ఈ సినిమా పై ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
కాగా, ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న మరో మూవీ " ఆది పురుష్". ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ఇష్టంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా ..అందాల తార బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా మనకు తెర పై కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి ప్రతి రోజు ఎదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో అద్దిరిపోయే ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఆది పురుష్ మూవీ టెక్నిషియన్ల అందరికి ప్రభాస్ ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడట. ఎంతో ఖరీదైన రాడో వాచ్‌లను ప్రభాస్ తన చిత్ర బృందానికి బహుమతిగా ఇచ్చారంటూ నెట్టింట ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమాకి సంబంధించిన ఓ టెక్నిషియన్ ఈ ఫోటోలు షేర్ చేయగా అసలు విషయం బయటపడింది. ఇక ప్రభాస్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ పట్ల టీం ఆనందం వ్యక్త చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి