ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఇంద్రజ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించారు ఇంద్రజ. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశారు అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ప్రతీ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఇంద్రజ. ఇకపోతే గతంలో జబర్దస్త్ అనే కార్యక్రమంలో రోజా స్థానంలో జడ్జిగా వచ్చారు. తన కల్మషం లేని నవ్వు తో తెలుగు ప్రేక్షకుల అందరిని ఆకర్షించారూ. దీంతో ఇంద్రజ నే జడ్జిగా కొనసాగించాలి అంటూ ఎన్నో డిమాండ్లు వచ్చాయి ప్రేక్షకులనుండి. ఇక ఆ తర్వాత ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ అదే కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతున్నారు ఇంద్రజ. కేవలం జడ్జ్ గా ఉండటమే కాదు అప్పుడప్పుడు ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇటీవల మరోసారి తన డాన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించేందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ఈ టీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ బండి పాట తో బాగా ఫేమస్ అయిన మోహన భోగరాజు ఎంట్రీ ఇచ్చి మళ్లీ బుల్లెట్ బండి పాట లైవ్లో పాడి అందరినీ అలరిస్తోంది. ఈ క్రమంలోనే జడ్జి సీట్లోంచి లేచి స్టేజ్ మీదకి వెళ్ళిన ఇంద్రజ మోహన భోగరాజుతో కలిసి బుల్లెట్ బండి పాట పై స్టెప్పులు వేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: