షావుకారు జాన‌కి ... ఈ తరానికి పెద్దగా తెలియక పొయినా, నాటి తరానికి పరిచయం అక్కర లేని వ్యక్తి.   దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ  ప్రజలను తన నటనా నైపుణ్యంతో అలరించిన వ్యక్తి. యావత్ భారతావని గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆమె పేరు హఠాత్తుగా  వెలుగులోకి వచ్చింది...కారణం ఏమిటో తెలుసా ?తమిళనాడు కోటాలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నవారిలో తెలుగింటి ఆడపడుచు షాపుకారు జానకి కూడా ఒకరు. ఇది తెలుగు వారు ఎంతో సంతోషించ తగ్గ అంశం. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నప్పటికీ ఆ కోటాలో ఆమె కు పద్మ పురస్కారం దక్కక పోవడం ఒకింత బాధాకరమైన విషయం. ఇలాంటి బాధాకరమైన సంఘటనలు తెలుగు వారికి కొత్త గాదు. గత ఏడాది పద్మ పురస్కారాలలోనూ జరిగింది. ప్రముఖ నేపథ్య గాయకుడిగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న గాన గాంధర్వ బిరుదాంకతుడు  ఎస్పీ బాలుకి కూడా మరణానంతరం లభించిన పద్మ పురస్కారం తమిళనాడు నుంచే వచ్చిన విషయం మనం గమనించుకోవాలి. ఇక అసలు విషయానికి వద్దాం. షాపుకారు జానకి గురించి నాలుగు మాటలు...
పవిత్ర గోదావరి తీరం రాజమండ్రిలో షాపుకారు జానకి డిసెంబర్ 12వ తేదీ 1931వ సంవత్సరంలో జన్మించారు. ఆ రోజుల్లో  ప్రధాన ప్రసార మాథ్యమం రెడియోనే. . తన పదకొండవ ఏటనే రేడియో కార్యక్రమంలో పాల్గోన్నారామే. చిన్నప్పటి నుంచి నాటక రంగం పై ఆమెకు ఎక్కువ మక్కువ.  దీంతో ఆమె రంగ స్థలం పై నాటకాలు వేశారు.  అదే సమయంలో చిత్ర రంగ ప్రవేశం చేశారు. చిత్ర రంగంలో ఎంతో బిజీగా గడిపిన రోజుల్లోనూ ఆమె నాటక రంగానికే ఎక్కు వ ప్రాధాన్యనతను ఇచ్చేవారు. ఆమె నటించిన మొట్టమొదటి చిత్రం షావుకారు.  విధి విచిత్రమో, సినీ రంగలో నేటికీ వస్తున్న ఆనవాయితీనో ఏమో కానీ,  ఆమె షాపుకారు జానకిగా గుర్తింపు పొందారు. దాదాపు 380కి పైగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు. అంతే కాదు  ఒక మళయాళ చిత్రంలోనూ, మూడు హిందీ చిత్రాలలోనూ నటించారు. దక్షిణ భారతావనిలో పేరెన్నిగన్న నాటి హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్ తదితరుల సరసన కథానాయికగా నటించారు. షావుకారు జానకి కి పద్మపురస్కారం రావడం తెలుగువారు గర్వించ తగ్గ విషయం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: