సినీ ఇండస్ట్రీ పెద్దలతో ఇవాళ జరగాల్సిన మెగాస్టార్‌ చిరంజీవి భేటీ వాయిదా పడడం జరిగింది.ఇక  ఈ సమావేశం రేపు జరుగనుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర తనకు వద్దంటూనే.. బాధ్యతలు తీసుకుంటున్న ఈయన.. ఇండస్ట్రీ ముఖ్యులతో 2022, ఫిబ్రవరి 08వ తేదీ మంగళవారం భేటీ కానున్నారు. ఇక ఈ భేటీలో చిరంజీవి మరియు తదితరులు   సినిమా టిక్కెట్ల వ్యవహారం మొదలు థియేటర్ల అంశాల వరకు అన్నీ ఈ సమావేశంలో చర్చించనున్నారు.  అంతేకాకుండా దీంతోపాటు మళ్లీ ఏపీ సీఎం జగన్‌తో జరిగే భేటీలో ఏయే అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్నదానిపై చర్చించనున్నారు.  

అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మెగా స్టార్ చిరంజీవి... తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ఏ విషయాలను చర్చించాలి అన్న అంశంపై ఈ భేటీ కొనసాగుతుంది. అయితే చిరంజీవి గతంలో సీఎం జగన్ తో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు వివరించారు. అయితే చిరంజీవి టిక్కెట్ల వ్యవహారం, థియేటర్‌ యజమానుల ఇబ్బందులు, సినీ కార్మికుల కష్టాలతోపాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇతరత్రా సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది .

అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అయితే గతంలో చిరంజీవి తో పాటు నాగార్జున కూడా సీఎం జగన్‌తో చర్చలు..సానుకూల స్పందనపై ఇప్పటి వరకు  ఓపెన్ గానే హర్షం వ్యక్తం చేసారు. ఇక ప్రస్తుతం ఈ భేటీలో చిరంజీవి పాత్ర చాలా ఆసక్తిగా మారింది. అంతేకాకుండా దీంతోపాటు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదిక ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  అయితే ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించేలోగా  టాలీవుడ్ ప్రముఖలతో జరిగే సమావేశం పైన అటు రాజకీయంగా… ఇటు సినీ పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొని ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: