‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ హంగామా కొనసాగుతూనే ఉంది. ఒక్క ఉత్తరాది రాష్ట్రాలలో మినహా దక్షిణాది ప్రేక్షకులు ఈమూవీని విపరీతంగా చూస్తున్నారు. ఓవర్సీస్ లో కూడ ఈమూవీ 10 మిలియన్ డాలర్ల కలక్షన్స్ చేరుకోవడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ‘బాహుబలి’ అదేవిధంగా ‘పుష్ప’ మూవీలు బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయిన రీతిలో ‘ఆర్ ఆర్ ఆర్’ కనెక్ట్ కాలేకపోతోంది.
దీనితో జకన్న మ్యాజిక్ ఉత్తరాదిలో వర్కౌట్ కాలేదా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే చరణ్ జూనియర్ అభిమానుల నుంచి ఒక వింత డిమాండ్ పుట్టుకు వస్తోంది. ఈసినిమాకు సీక్వెల్ తీయమని చరణ్ జూనియర్ అభిమానులు రాజమౌళిని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు.
ఈమూవీలో తాము తమ అభిమాన హీరోలు చరణ్ జూనియర్ లను మూడు గంటలు చూసినప్పటికీ తమకు మనసుకు సంతృప్తి కలగలేదనీ అందువల్ల మరొకసారి ఈమ్యాజిక్ కాంబినేషన్ ను రిపీట్ చేసి ‘ఆర్ ఆర్ ఆర్’ సీక్వెల్ చేయమని అభిమానులు అడుగుతున్నారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందే రాజమౌళి ఈమూవీకి సీక్వెల్ ఉండదని క్లారిటీ ఇచ్చాడు. దీనికితోడు ఈమూవీకి ఉత్తరాది ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాకపోవడంతో వాస్తవానికి ఈమూవీ పాన్ ఇండియా మూవీగా కాకుండా దక్షిణాది సినిమాగా మిగిలిపోయింది.
అయితే ఈసినిమాకు ఏర్పడిన విపరీతమైన మ్యానియా వల్ల ఈమూవీ కథ విషయంలో కొన్ని తేడాలు కనిపించినా వాటిని పట్టించుకోకుండా ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. దీనితో ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు గట్టేక్కుతారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా కొందరు సినిమా ప్రముఖులు మరికొందరు రాజకీయ ప్రముఖులు ఈసినిమాకు వినోదపు పన్ను మినహాయించాలని కోరుతున్నారు. స్వాతంత్రోద్యమ స్పూర్తితో ఈమూవీని నేటితరం ప్రేక్షకులు అందరు చూడవలసి ఉన్న నేపధ్యంలో ప్రభుత్వాలు ఈమూవీకి వినోదపు పన్ను రాయితీ ఇవ్వాలని కోరుకుంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి