
తొలిసారిగా మెగా తండ్రి కొడుకులు నటిస్తుండడంతో అటు మెగా ఫ్యాన్స్ లో మాత్రమే కాదు ఇటు యావత్ తెలుగు ఆడియన్స్ అందరిలో కూడా మూవీ పై గ్రాండ్ హైప్ ఏర్పడింది. మరోవైపు ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, టీజర్స్ అన్ని కూడా ఆకట్టుకోవడంతో ఆచార్య పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని అందరూ భావించారు. అయితే అన్ని అంచనాలు తలక్రిందులు చేస్తూ రిలీజ్ తరువాత మొదటి రోజు మొదటి ఆట నుండి భారీ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న ఆచార్య మూవీ ప్రస్తుతం భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా సినిమాలో దర్శకుడు కొరటాల ఎంచుకున్న కథ బాగానే ఉందని, అయితే దానిని ఆకట్టుకునే రీతిలో తీయడంలో ఆయన పూర్తిగా విఫలం అయ్యారని, అయితే ఆచార్య గా మెగాస్టార్, సిద్ద గా మెగాపవర్ స్టార్ తమ తమ పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించారని పలువురు ప్రేక్షకాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మొన్న సోమవారం నుండి ఆచార్య కలెక్షన్స్ ఆల్మోస్ట్ అనేక ప్రాంతాల్లో పడిపోవడంతో ఈ మూవీ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో పవన్ అజ్ఞాతవాసి, ప్రభాస్ రాధేశ్యామ్, మహేష్ స్పైడర్ సినిమాలు నిలవగా వాటిని మించుతూ మరింత దారుణమైన నష్టాలు ఆచార్య మూవీ తెచ్చిపెట్టి టాప్ స్థానంలో నిలిచే అవకాశం గట్టిగా ఉందని, అందుకే మూవీని వీలైనంత త్వరలో ఓటిటి లోకి తీసుకువచ్చేలా యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. కాగా ఆచార్య ఓవరాల్ గా ఎంత మేర నష్టాలు మిగిలించిందనేది మరికొద్దిరోజుల్లో తెలియనున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు.