కోలీవుడ్ హీరోలలో ఒకరు అయిన ఉదయనిధి స్టాలిన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉదయనిధి స్టాలిన్ 'ఓకే ఓకే' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఓకే ఓకే మూవీ లో హన్సిక హీరోయిన్ గా నటించగా ఈ మూవీ కి ఎం. రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో  సంతానం ముఖ్యమైన పాత్రలో నటించాడు.  ఓకే ఓకే  మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఆ తర్వాత శీనుగాడి లవ్ స్టోరీ ,  సైకో మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.  

శీనుగాడి లవ్ స్టోరీ సినిమా తెలుగు  ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ సైకో సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  ఇలా తాను నటించిన తమిళ సినిమా లను  డబ్ చేసి తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఉదయనిది స్టాలిన్ ప్రస్తుతం 'మామన్నన్' మూవీ లో నటిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఉదయనిది స్టాలిన్ ఒక సంచలన ప్రకటన చేశాడు.  

ప్రస్తుతం తాను నటిస్తున్న 'మామన్నన్'  మూవీ నే తన చివరి సినిమా అని ఉదయనిధి స్టాలిన్ సంచలన ప్రకటన చేశాడు.  ప్రస్తుతం తమిళనాడు లోని చెపాక్ లో ఎమ్మెల్యే గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ రాజకీయాలను మరియు సినిమా లను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అని,  ఇకపై ప్రజాసేవకే సమయం కేటాయిస్తాను అని  తాజాగా తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే ఉదయనిధి స్టాలిన్ నటించిన 'నెంజుకు నీది' మూవీ మే 20 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: