తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో భారీ క్రేజ్ ఉంది. సింగిల్ టేక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని రిహార్సల్స్ కు రాకుండా తారక్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు పలు సందర్భాల్లో తారక్ గురించి గొప్పగా చెప్పారనే విషయం తెలిసిందే.


తారక్ కు వేర్వేరు అంశాల గురించి కూడా ఎంతో లోతైన అవగాహన ఉంది. బిగ్ బాస్ సీజన్1, ఎవరు మీలో కోటీశ్వరులు షోల ద్వారా తారక్ హోస్ట్ గా బాగా మెప్పించారు.


ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి తారక్ ప్రశంసలు అందుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు సముద్రఖని తాజాగా ఒక సందర్భంలో తారక్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారట.జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటారని సముద్రఖని చెప్పుకొచ్చారు. రాజకీయాల గురించి తారక్ కు లోతుగా జ్ఞానం ఉందని సముద్రఖని చెప్పుకొచ్చారట. తారక్ తనతో తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడారని ఎన్నికలకు ముందే డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని తారక్ చెప్పారని సముద్రఖని కామెంట్లు చేశారట.


 


ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికల ఫలితాల విషయంలో నేను చెప్పిందే నిజమైంది కదా అని తారక్ అన్నారని సముద్రఖని చెప్పుకొచ్చారు.. సమాజం, రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఎన్టీఆర్ తో మాట్లాడాలని సముద్రఖని చెప్పారు.. సముద్రఖని తారక్ తనను ఆశ్చర్యానికి గురి చేశారని చెబుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.


 


2009 సంవత్సరంలో తారక్ టీడీపీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో తారక్ ను ఏపీ సీఎంగా చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజకీయాలపై తారక్ కు ఆసక్తి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ వెనుకడుగు వేస్తున్నారట.. రాబోయే రోజుల్లో తారక్ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే బాగా ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: