అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి మూవీ తోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.  సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే సాయి పల్లవి ఇప్పటివరకు తన కెరియర్ లో గ్లామర్ పాత్రలకు, కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ తన కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది.

ఇలా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న సాయి పల్లవి కొన్ని రోజుల క్రితం శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమాలో దేవాదాసి  పాత్రలో నటించిన సాయి పల్లవి తన నటనతో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలను పొందింది. తాజాగా సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా జులై 1 వ తేదీన విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా సాయి  పల్లవి కి మీకు బాగా ఇష్టమైన నటుడు ఎవరు అనే ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానమిస్తూ... కమల్ హాసన్, సూర్య , మమ్ముట్టి అంటే నాకు బాగా ఇష్టం అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం అని,  ఇప్పటికీ కమల్ హాసన్ పోస్టర్ లను కట్ చేసి పేపర్ లో దాచుకుంటాను అని సాయి పల్లవి తెలియజేసింది.
ఇది ఇలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మించబోతున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.  కమల్ హాసన్ నిర్మించబోయే సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: