గతంలో ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పిన ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. టాలీవుడ్ దిగ్గజ దర్శశకుడు రాజమౌళి తెరకెక్కించిన సిల్వర్ స్క్రీన్ అద్భుతం బాహుబలి సిరీస్. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తనివి తీరదు. ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలలోనే ప్రదర్శించబడి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా నుండి రాజమౌళి పేరు దేశంలోనే మారుమ్రోగిపోయింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ రచయిత డైమండ్ రత్న బాబు కొన్ని కీలక విషయాలు చెప్పడం జరిగింది.

బాహుబలి సినిమా రిలీజ్ అయి హిట్ అయిన సమయంలో అందరూ ఎంతసేపు డైరెక్టర్ , హీరో మరియు నిర్మాతలు గురించి ఎక్కువగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో వచ్చే ప్రతి ఒక్క డైలాగ్ ను ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమా చూసిన ప్రేక్షకులకు ఆవిరి రాసిన రైటర్ ఎవరనే విషయం తెలుసా? అంటూ అప్పట్లో ఒక పత్రికలో ఒక సంచిక వచ్చింది. ప్రముఖ సినీ మాటల రచయిత డైమండ్ రత్నబాబు రచయితలకు ఎందుకు తగిన గుర్తింపు రావడం లేదన్న విషయంపై చేరిన వ్యాఖ్యలను అప్పట్లో హైలైట్ చేశారు. వాస్తవానికి రైటర్ లకు ఏ విధమైన గుర్తింపు రావడం లేదు అంటూ రత్నబాబు క్లారిటీ ఇచ్చారు.

ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు నిర్మాతలకు ఎక్కువగా గుర్తింపు వస్తోందని సినిమా కోసం కష్టపడి మాటలు రాసే మాలాంటి రచయితలకు ఏ గుర్తింపు లేదని అందుకే రైటర్స్ అందరూ డైరెక్టర్స్ గా మారిపోతున్నారని సెలవిచ్చారు. అందులో భాగంగానే రచయితలుగా ఉంటూ డైరెక్టర్ లుగా మరీనా వారి పేర్లను చెప్పారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్, కొరటాల శివ... ఇంకా చాలా మంది రైటర్ గా పనిచేసి రాని గుర్తింపును ఇలా డైరెక్టర్ గా మారి జేజేలు పలికించుకుంటున్నారు అంటూ కుండబద్దలు కొట్టారు డైమండ్ రత్నబాబు.గుర్తింపు

రెమ్యూనరేషన్

ఆడియో

మరింత సమాచారం తెలుసుకోండి: