ఎన్టీఅర్ కొరటాల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ కోసం తారక్ సుమారు 15 కేజీలు బరువు తగ్గి సంనబడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనికోసం జూనియర్ ఒక స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని గంటల కొద్ది తన జిమ్ లో కష్టపడుతున్నాడు అన్న మాటలు కూడ వినిపించాయి. అయితే దీనికి భిన్నంగా జూనియర్ లుక్ కనిపించింది.
‘ఆర్ ఆర్ ఆర్’ లోని కొమరం భీమ్ పాత్ర కోసం జూనియర్ ఒత్తుగా పెంచుకున్న గడ్డం అలాగే ఉండి పోయింది. అంతేకాదు తారక్ కూడ పెద్దగా సన్నపడినట్లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ చూసిన వారికి అనిపించలేదు. దీనితో కొరటాల జూనియర్ ల మూవీ షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతుందా అన్న సందేహాలు అభిమానులకు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి జూనియర్ కూడ ‘ఆచార్య’ మూవీకి వచ్చిన భయంకరమైన ఫ్లాప్ టాక్ విని షాక్ అయినట్లు సమాచారం.
దీనితో కొరటాల దర్శకత్వంలో తాను నటించబోయే కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తారక్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా సమయం ఉంది కాబట్టి తారక్ తన బరువు తగ్గడానికి నెమ్మదిగా జిమ్ చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే తారక్ కు తన తాత ఎన్టీఆర్ లానే వేసవికాలంలో పెట్టే రకరకాల ఆవకాయలు తినడం ఇష్టం కాబట్టి ఇప్పుడు ఆపనిలో బిజీగా ఉంటూ తన బరువు తగ్గే విషయంలో నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడా అంటూ కొందరు జోక్స్ వేస్తున్నారు. ఏమైనా తారక్ కొరటాల ల మూవీ మొదలు కావడానికి ఇంకా సమయం పట్టే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి