మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా ఈ ఏడాదే విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటిదాకా అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ ఈ చిత్రంతో తొలి ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. టాప్ హీరోలైన తండ్రి కొడుకులు కలిసి పూర్తిస్థాయిలో ఓ సినిమాలో నటించలేదు కాబట్టి ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకొని తమ కాంబోకి క్రేజ్ తీసుకురావాలని వారు భావించారు. 

కానీ కథలో లోపం స్క్రీన్ ప్లే లో అయోమయం ఉండడంతో ఈ చిత్రం ను ప్రేక్షకులు ఆమోదించలేకపోయారు. తమ ఇద్దరు అభిమాన హీరోలు కలిసిన నటిస్తున్న సినిమా లో మంచి కథను మెగా అభిమానులు అంచనా వేయడమే ఈ విధమైన ఫలితం రావడానికి కారణం. చాలామంది సినిమా విశ్లేషకులు ఈ సినిమా ఇలా అయిపోవడానికి కారణాలు చాలా విశ్లేషించారు అలా తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా ఉన్న పలుచూరి బ్రదర్స్ కూడా ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలను విశ్లేషించారు.

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలైన వీరిద్దరూ ఒకే పని కోసం పోరాడడం అనేది ప్రేక్షకులకు నచ్చలేదని, దానికి తోడు ఈ ఇద్దరు హీరోల కంటే ఎక్కువగా కథే సినిమాను ఆక్యుపై చేసిందని అన్నారు ఈ రెండు కారణాలే ఈ సినిమా బాగా ఆడక పోవడానికి కారణం అని కూడా ఆయన చెప్పారు. చిరంజీవి సినిమాలలో కథ లేకపోయినా కూడా ఆయన ఫేస్ చూసే హిట్లయినా చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించిన సినిమా ఇలా అవ్వడానికి కారణం ఓవర్ హైప్ చేయడమే అని కూడా అన్నారు. ఇప్పుడు వీరు సోలోగా మళ్లీ హిట్ ట్రాక్ లో ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: