అందాల ముద్దుగుమ్మ ఆదాశర్మ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయం అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

సినిమా మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఆదా శర్మ తన అందచందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఆదాశర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సన్నాఫ్ సత్యమూర్తి ,  సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , గరం , క్షణం వంటి పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆదాశర్మ సోషల్ మీడియాలో ద్వారా తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.  

ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉండే ఆదాశర్మ తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఆదాశర్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో పచ్చని ఆకులను కలిపి గౌన్ ల డిజైన్ చేయించుకొని వేసుకున్న డ్రెస్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆదాశర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: