
అయితే ఇప్పటికే యూత్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన ‘లైగర్’ మూవీ విషయంలో అనుసరిస్తున్న కొత్త పబ్లిసిటీ వ్యూహం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘లైగర్’ మూవీ ట్రైలర్ లాంచ్ ను ఆర్టిసి క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎంలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్న సందర్భంలో ఆ ధియేటర్ల బయట ఏర్పాటు చేసిన 80 అడుగుల భారీ విజయ్ దేవరకొండ కటౌట్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
సినిమా పబ్లిసిటీలో ఇది ఒక భాగం అని భావించినా ఇలా విజయ్ దేవరకొండను హీరోయిన్ లాగ తక్కువ దుస్తులతో చూపించడం ఏమిటో చాలామందికి అర్థం కాలేదు అని తెలుస్తోంది.ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడు కాబట్టి ఒంటిమీద ఒక్క డ్రాయర్ తప్ప మరే బట్టలు లేకుండా నటించడం సహజమే అయినప్పటికీ ఇలా అదే పోజును పబ్లిసిటీకి వాడుకోవాల అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆమధ్య ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఒక పోష్టర్ లో పూల గుత్తిని అడ్డుగా పెట్టుకుని నగ్నంగా నిలబడి ఉన్న విజయ్ ఫోటో పై విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ మ్యానియాను యూత్ లో విపరీతంగా పెంచాలని ఈమూవీ యూనిట్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగమే ఈ 80 అడుగుల కటౌట్. వరస పరాజయాలతో సతమతమౌతున్న విజయ్ కు ఈ వెరైటీ పబ్లిసిటీ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి..