టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించాడు . 

మూవీ లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించాడు . ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ యూనిట్ టీజర్ మరియు ట్రైలర్ మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అన్నింటిలో కూడా కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు . ఈ సినిమాను ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది . సెన్సార్ బోర్డ్ నుండి బింబిసార మూవీ కి యూ / ఏ సర్టిఫికెట్ లభించింది.

అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైం ను కూడా లాక్ చేసింది.  ఈ మూవీ 2 గంటల 26 నిమిషాల మీడియం రేంజ్ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , క్యాథరిన్ , సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: