ప్రయోగాలు చేయాలంటే అమలాపాల్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.. ఇక ఆమె సినిమాలలో ఏకంగా నగ్నంగా కూడా నటించి పెను సంచలనం సృష్టించింది. ఈమె పెర్ఫార్మెన్స్ కి ధైర్యానికి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా లభించడం గమనార్హం. ఇక ఈ క్రమంలోని ఇప్పుడు మరొక ఛాలెంజ్ రోల్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ . కడవర్ అనే మూవీ టైటిల్ తో ఈ సినిమాను మలయాళీ డైరక్టర్ అనూప్ పనికర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంలో అమలాపాల్ పోలీస్ అధికారిణి గా నటించడం జరిగింది . ముఖ్యంగా ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా డిజిటల్ విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం.


తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చెయ్యగా ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేస్తోంది. ముఖ్యంగా ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ మూవీ అని అర్థమవుతుంది. ఇకపోతే డాక్టర్ భద్ర అనే పోలీసు సర్జన్ పాత్రలో అమలాపాల్ ఇందులో నటించింది.ముఖ్యంగా తప్పిపోయిన బాలిక శవమై కనిపించగా గ్యాంగ్ రేప్ చేశారని అనుమానించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు పోలీసులు .ఈ క్రమంలోని డాక్టర్ భద్ర అలియాస్ అమలాపాల్ ఈ కేసును ఎలా చేదించారు అనేది సినిమా కథాంశం. ముఖ్యంగా యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. కాబట్టి సినిమాను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే ఆతృత కూడా ప్రేక్షకులలో ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచగా సినిమా ఆటోగ్రఫీ మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు ఈ సినిమాలో అమలాపాల్  రెండు విభిన్నమైన షేడ్స్ తో కనిపిస్తూ ఉండడంతో పాటు ఆమె ఎంతో నేచురల్ గా కనిపిస్తోంది. ఇక ఆగస్టు 12వ తేదీన తమిళ్ , తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో కి సిద్ధమవుతోంది కడవర్ మూవీ. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: