సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీలు సైతం అభిమానులకు బాగా దగ్గరగా మారిపోయారు. నటీనటులు సైతం తమ అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఫాలోవర్స్ నుంచి నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి.. ఇక అంతే కాకుండా ట్రోల్ చేయడం వంటివి కూడా జరుగుతూ ఉంటుంది. నెటిజన్స్ చేసే ప్రతి కామెంట్, ట్రోల్స్ ను కూడా నటీనటులు సైతం చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి కామెంట్స్ బారిన పడింది హీరోయిన్ , బిగ్ బాస్ విన్నర్ బింధు మాధవి.అయితే ఈమెకు తాజాగా నెట్టింట ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె డ్రెస్సింగ్ వల్ల గౌరవం పోయింది అంటూ ఒక నేటిజన్ చేసిన కామెంట్ ఈమెకు విసుగు తెప్పించేలా ఉండడంతో వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే బిగ్బాస్ లో ఉన్నప్పుడు తన ఆట తీరు ఆటిట్యూడ్ ఎంతో మంది అభిమానులను బాగా ఆకట్టుకుంది. అబ్బాయిలకు దీటుగా పోటీనిచ్చి బిగ్ బాస్ టైటిల్ ని కైవసం చేసుకున్నది ఈ ముద్దుగుమ్మ. అయితే బిగ్ బాస్ లో బింధు మాధవి పాల్గొన్నప్పుడు ఆమె అంటే తనకు చాలా గౌరవం ఉండేది. ఎందుచేత అంటే ఇతర కన్సిస్టెంట్లు అందరూ తమ బాడీ ని ఎక్స్పోజింగ్ చేసేవారు.. ఆమె మాత్రం చాలా చక్కనైన డ్రెస్ వేసుకుంటూ ఉండేది అని.. ఆ గౌరవం పోయింది అంటూ నెటిజన్ బిందు మాధవిని ఉద్దేశిస్తూ ఒక కామెంట్ చేయడం జరిగింది.


ఇది చూసిన బింధు మాధవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒక వ్యక్తికి ఇచ్చే.. వేసుకుని దుస్తుల కారణంగా  గౌరవం ఉంటే అలాంటి గౌరవం తనకు వద్దని కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో బిందు మాధవికి మద్దతు ఇస్తున్న నెటిజెన్లు వేసుకునే దుస్తులను బట్టి  మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: