చిరంజీవి పుట్టినరోజు వేడుకను ఒక పండుగలా జరుపుకుంటూ ఉంటారు అభిమానులు. తమ అభిమాన హీరోకు బర్తడే విషెస్ ను సరికొత్తగా చెబుతూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు.. తెలంగాణలోని గద్వాల్ అభిమానులు. అయితే వారు చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఉప్పుతో చిరంజీవి చిత్రపటాన్ని వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం . చిరంజీవికి ఈ ఏడాది మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారని అభిమానులు చెప్పవచ్చు. పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవికి ఒక డిఫరెంట్ విషెస్ చెప్పారూ..గద్వాల్ అభిమానులు. ఉప్పుతో చిరంజీవి చిత్రపటాన్ని గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అది కూడా గద్వాల్ జిల్లా అంతటా చిరంజీవి బర్త్డే వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నట్లు తెలియజేశారు.
ఇక సంబరాలు చేసుకుంటూ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే చిరంజీవిపై తమకున్న అభిమానాన్ని మరింత విస్తృతంగా చాటాలనుకుంటున్న నేపథ్యంలో గద్వాల్ లో చిరంజీవి ఫ్యాన్స్ పట్టణంలోని రాయచూరు రోడ్డులో 30 క్వింటాల ఉప్పు లవంగాలతో చిరంజీవి చిత్రపటాన్ని నిర్మించారు.. దీని వెడల్పు 400 అడుగులు ఎత్తు 250 అడుగులతో ఈ చిత్రపటాన్ని నిర్మించారు. ఈ వేడుకలు బోయ జమ్మన్న ఆధ్వర్యంలో కొనసాగినట్లు తెలుస్తోంది . గద్వాల్ లో నిర్వహించిన ఈ చిరంజీవి బర్త్డే వేడుకలలో మెగా ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా రోడ్డుకి పక్కన పొలంలో రూపొందించిన ఈ చిత్రపటాన్ని చూసి చాలా మురిసిపోతున్నారు అభిమానులు. ఇలాంటివి చిరంజీవికి మర్చిపోలేని ట్రీట్ అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి