జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అపరిచితులుగా జబర్దస్త్ లో చేరిన వారు ఆ తర్వాత అందరికీ సుపరిచితులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వడమే కాదు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు అని చెప్పాలి.  ఇలా జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఇక తనదైన శైలిలో జబర్దస్త్ లో ఎన్నో ఏళ్లపాటు కామెడీ పంచిన ముక్కు అవినాష్ టీం లీడర్ గా ఎదిగాడు.


 కానీ ఆ తర్వాత మాత్రం బిగ్ బాస్ ఆఫర్ రావడంతో చివరికి జబర్దస్త్ ను వదిలేసి బిగ్ బాస్ లో కంటెస్టెంట్గా వెళ్లిపోయాడు. దీంతో అతనికి జబర్దస్త్ లో రీ ఎంట్రీ లేకుండా పోయింది అని చెప్పాలి. ఇక అప్పట్లో అవినాష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ మా లో స్టార్ కమెడియన్గా కొనసాగుతున్నాడు ముక్కు అవినాష్. ఇక ఇప్పుడు ఈటీవీలో ప్రతి ఈవెంట్లో హైపర్ ఆది ఎలాగైతే మెయిన్ కమెడియన్గా ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడో.. ఇక స్టార్ మా లో కూడా ఏ ఈవెంట్ ప్రారంభమైన అందులో మెయిన్ కమెడియన్ గా కనిపించేది మాత్రం అవినాష్ మాత్రమే. ఎలాంటి ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించిన అందులో అవినాష్ ఉంటున్నాడు.


 ఇలా ఈటీవీలో హైపర్ ఆది తరహాలోనే అటు స్టార్ మాలో ముక్కు అవినాష్ కూడా ఊహించని రీతిలో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు అన్నది తెలుస్తుంది. అంతేకాదు ఇక ఈటీవీలో ప్రతి షోలో మూల స్తంభం గా మారిపోయిన హైపర్ ఆదికి మల్లెమాలు వాళ్ళు భారీ రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా అటు స్టార్ మా లో కూడా అచ్చం హైపర్ ఆది రేంజ్ ను కొనసాగిస్తున్న అవినాష్ ను హైపర్ ఆది తో సమానంగానే రెమ్యూనరేషన్ అందుతుంది అన్నది తెలుస్తుంది. ఏదేమైనా ఈటీవీ ని వదిలి స్టార్ మా లో సెటిల్ అయిన అవినాష్  అక్కడ బాగానే సంపాదిస్తున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: