బింబిసార: అప్పట్నుంచి ఓటీటిలో మహా యుద్ధమే?

ఇక ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ 'బింబిసార' ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించగా, ఫిక్షన్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించిన తీరు బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు.రిలీజ్ తరువాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కట్టారు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా 70 కోట్ల దాకా వసూళ్ళని రాబట్టి మంచి లాభాలను అందించింది. ఈ సినిమా హిట్ తో నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యారు.ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 


కాగా బింబిసార సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తరువాతే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనె వెల్లడించింది. ఇక దీంతో ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. చిత్ర వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో అక్టోబర్ 7న స్ట్రీమింగ్ చేయనున్నారట.ఈ వార్తతో నందమూరి అభిమానులు బింబిసార చిత్రం కోసం మరోసారి ఆతృతగా చూస్తున్నారు. అయితే దసరా సెలవుల సమయంలో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుండటంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక థియేటర్ లలో దుమ్ములేపిన ఈ సినిమా మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: