సాధారణంగా ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని ఎంతోమంది ఎంట్రీ ఇస్తారు. కానీ అదృష్టం కలిసి రాక అవకాశాలు తలుపు తట్టక.. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సరిపెట్టుకోవడం లేదా వేరే ప్రొఫెషన్ లోకి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక అందరికీ సుపరిచితురాలు అయినా జబర్దస్త్ యాంకర్ రష్మీ విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి. హీరోయిన్ అవుదామని వచ్చిన రష్మి కాస్త చివరికి బుల్లితెరపై యాంకర్ గా సెటిల్ అయింది. ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ పుణ్యమా అని అటు బుల్లితెరపై హీరోయిన్ రేంజ్ లోనే గుర్తింపు సంపాదించుకుంది.


 ఇక ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తన అందం అభినయంతో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సుధీర్ హోస్ట్ గా చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈటీవీ నుంచి వెళ్లిపోయిన సుధీర్ ఇక ఈ షో యాంకర్ గా కూడా తప్పుకున్నాడు. ఇక ఇప్పుడు అదే షోకి యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుదీర్ కు మించిన రెమ్యూనరేషన్  తీసుకుంటుంది అన్నది సోషల్ మీడియాలో వినిపించే మాట.


అయితే రష్మీ బయటికి ఎంతో ధైర్యంగా కనిపించినా చాలా సెన్సిటివ్ అన్న విషయం తెలిసింది. ముఖ్యంగా జంతు ప్రేమికురాలు. జంతువులకు ఏ చిన్న అపాయం కలిగిన  కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనె ఇటీవల మనం మనుషులుగా పుట్టాం.. కనీసం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు.. హింసించకూడదు.. ప్రతి మనిషికి మూక జీవాలకు హెల్ప్ చేసే అంత స్తోమత ఉండకపోవచ్చు. కానీ హింసించకుండా ఉండే మనసు మాత్రం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు మూగజీవాలకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ హింసించకండి అంటూ రష్మి గౌతమ్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: