టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయినా అలీ కూతురు ఫాతిమా వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన  సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే నవంబర్ 27వ తేదీన జరిగిన వివాహానికి సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు సైతం రావడం జరిగింది.. అయితే సినీ ఇండస్ట్రీ మరియు రాజకీయ నాయకులు అందరూ హాజరైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అలీ కూతురు ఫాతిమా వివాహానికి రాలేదు. ఇక అలీ మరియు పవన్ కళ్యాణ్ ఎంత స్నేహంగా ఉంటారో మనందరికీ తెలిసిందే అంతే కాదు పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు 

అన్ని సినిమాల్లోనూ కూడా స్టార్ కమెడియన్ అని మనం చూసాం.. అయితే ఇంత క్లోజ్ గా ఉండే వీరిద్దరూ అలీ కూతురు పెళ్లికి పవన్ ఎందుకు రాలేదు అన్న విషయం అంతట చర్చనీయాంశం గా మారింది.. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో అలీ ఆయన మద్దతు వైసిపి పార్టీకి తెలిపిన సంగతి తెలిసిందే కదా..ఇక అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించారు. అయితే అలీ మరియు పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు రావడానికి ఇదే ముఖ్య కారణం అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే..

అయితే తాజాగా అలీ ఈ వార్తలు అన్నిటికి అడ్డుకట్ట పెట్టడం జరిగింది.. అయితే తాజాగా అలీ ఒక ఇంటర్వ్యూలో భాగంగా దీని గురించి మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న షూటింగ్లో భాగంగా పవన్ తో పాటు అక్కడ అందరికీ పెళ్లి కార్డు ఇచ్చానని... అంతేకాదు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా రూట్ మ్యాప్ చూశారని తప్పకుండా వస్తానని పవన్ కళ్యాణ్ ఆయనతో చెప్పినట్లుగా తెలిపాడు.. అయితే ఆఖరిలో ఆయన రాలేకపోయారని నీరుగా అలీకి ఫోన్ చేసి కూతురు అల్లుడు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పండి నేనే నేరుగా వచ్చి కలుస్తానని పవన్ కళ్యాణ్ అలీతో చెప్పినట్లుగా అలీ ఆ ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది.. దీంతో పవన్ కళ్యాణ్ అలీ కూతురు వివాహానికి ఎందుకు రాలేదు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: