నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన సినీ కెరియర్ మొదలుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. గతంలో వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కు రీసెంట్ గా బింబిసారా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు కొత్త దర్శకుడు రాజేందర్రెడ్డి పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.


ఇదంతా ఇలా ఉండగా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లేవలో తెరకెక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథ 1945 బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కించడం జరుగుతోంది. డెవిల్ లుక్ లో కళ్యాణ్ రామ్ కనిపించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.


అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ పై కళ్యాణ్ రామ్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా కోసం మొదట హీరోయిన్గా ముక్తా అని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు చిత్ర బృందం. అయితే ఆమె డేట్స్ కారణంగా ఈ చిత్రం నుంచి తట్టుకోవాల్సి వచ్చిందట. ఇక దీంతో మరొక మలయాళం హీరోయిన్ సంయుక్త మీనన్  తీసుకోవాలని డైరెక్టర్.. అనుకోగా కళ్యాణ్ రామ్ కు మాత్రం ఈమెను తీసుకోవడం ఇష్టం లేదు గతంలో బింబిసారా సినిమాలో నటించింది కనుక  కళ్యాణ్ రామ్ కొత్త హీరోయిన్ కోసమే వెతుకుతున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: