
వరుస సినిమాలలో అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ త్రిష డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. అయితే తాజాగా త్రిష రాంగీ ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగులో విడుదలకు ఆటంకం కలుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో రవితేజ ధమాకా , అవతార్ 2 సినిమాలు భారీ వసూలు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో థియేటర్లు ఖాళీగా లేవు. అందుకే త్రిష రాంగీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు లభించకపోవడం వల్లే సినిమాను తెలుగులో విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమాలో త్రిష బైక్ రైడింగ్ తో పాటు యుద్ధ విద్యల్లో కూడా ట్రైనింగ్ తీసుకుంది. రీసెంట్ గా ఉజ్బేకిస్తాన్ లో జరిగిన షూటింగ్ లో డూపు లేకుండా త్రిష పై తెరకెక్కించిన పోరాట దృశ్యాలు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తున్నాయని. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా, ఖైదీగా అద్భుతంగా పెర్ఫామ్ చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఈ సినిమా తమిళంలో విడుదలై ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.