టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ మంచి విజయం సాధించడంతో శ్రీనివాస్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది.

ఆ తరువాత అనేక మూవీ లలో హీరోగా నటించిన శ్రీనివాస్ కు రాక్షసుడు మూవీ తో అద్భుతమైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించింది. ఈ మూవీ ద్వారా శ్రీనివాస్ కు కూడా అదిరిపోయి రేంజ్ క్రేజీ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీనివాస్ ... వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చత్రపతి హిందీ రీమిక్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే శ్రీనివాస్ తదుపరి సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. శ్రీనివాస్ తన తదుపరి మూవీ ని సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటించబోతున్నట్లు , ఈ మూవీ ని 14 రీల్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సాగర్ పోయిన సంవత్సరం విడుదల అయిన భీమ్లా నాయక్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ... రానా లు హీరోలుగా నటించారు. ఈ మూవీ ద్వారా సాగర్ కు మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: