టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న చాలామంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తమ తాతలు ,తండ్రుల పేర్లు చెప్పుకొని వచ్చినవారే. కానీ ఒకప్పుడు మాత్రం సీనియర్ ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్, చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ ,శోభన్ బాబు లాంటి  వీరందరూ కూడా అప్పట్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోలుగా మారారు. వారి తర్వాత ఆ స్థాయిలో ఏ స్టార్ హీరో కూడా రాణించలేదు అని చెప్పాలి. కానీ ఈ జనరేషన్ లో మాత్రం చాలామంది హీరోలు తన తాతలు తండ్రుల బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వారే. తమ టాలెంట్ చూపిస్తూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారు చాలా తక్కువ మంది. 

ఇక అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా చాలా మనీ అవుతున్న హీరోలలో టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ నాని కూడా ఒకరు. టాలీవుడ్ ని ఇండస్ట్రీకి నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా చలామణి అవుతున్నాడు. గతంలో ఆయనకి ఎలాంటి టాలెంట్ లేకపోయినప్పటికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన కెరియర్ను మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు.అంతేకాదు  చాలా తక్కువ సమయంలోనే ఆయనకున్న టాలెంట్ తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. అయితే గతంలో నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు

 సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో నాచురల్ స్టార్ నాని ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు ఎలాంటి టాలెంట్ లేకపోయినప్పటికీ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇక అలాంటి వారిలో కొందరు నాలాంటి వారిని తొక్కేయాలని ప్రయత్నిస్తారు అంటూ ఎవరూ ఊహించిన విధంగా సంచలన వ్యాఖ్యలను చేశాడు నాని. దీంతో అప్పట్లో నాని పై కొందరు స్టార్ హీరోలకు కోపం వచ్చింది అని కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది.దీంతో గతంలో నాని చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: