
తాజాగా జరిగిన కొన్ని విషయాలను చూస్తే ఈ సెంటిమెంట్ నిజమే అని అభిమానులు కూడా నమ్మ పలుకుతున్నారు. అన్ స్టాపబుల్ షో కి హాజరైన శర్వానంద్, రక్షిత రెడ్డి అనే అమ్మాయితో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ప్రభాస్ కూడా తన పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ వివాహానికి సంబంధించి త్వరలోనే ఒక విషయం బయటికి రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అభిమానులకు కాస్త సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ప్రభాస్, శర్వానంద్ వివాహం కొన్ని నెలల గ్యాప్ లోనే జరగబోతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ వయసు పెరుగుతున్న కొద్దీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. ఏది ఏమైనా బాలయ్య ఎపిసోడ్కి పెళ్ళికాని హీరోలు వెళితే ఖచ్చితంగా పెళ్లి సెటైల్ అవుతుందని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులు. ప్రస్తుతం ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ ప్రాజెక్ట్-k, స్పిరిట్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.