తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ మంగ్లీ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఒక సాదా సీదా యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన మంగ్లీ ఇక తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ను బయటపెట్టి అందరిని మంత్రముగ్ధులను చేసింది అని చెప్పాలి. ఎవరికి సాధ్యం కాని రీతిలో తన గాత్రంతో ఇక ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఆమె పాట పాడుతూ ఉంటే జానపదానికి కొత్త రూపం ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పాలి. మొదట్లో తెలంగాణ యాసలో పాటలు పాడుతూ బతుకమ్మ సాంగ్స్ తో ఎంతగానో ఫేమస్ అయ్యింది మంగ్లీ
 ఇక తర్వాత సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది.


 ఇక సినిమాలో మంగ్లీ పాడిన ప్రతి పాట కూడా ప్రేక్షకులను ఉరూతలుగిస్తూ సూపర్ హిట్ కావడంతో ఆమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సింగర్ గా కొనసాగుతోంది మంగ్లీ. ఇప్పటివరకు మంగ్లీ పాడిన పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను అటు సోషల్ మీడియాను కూడా ఊపేసాయి. ఇప్పటికి ఎంతోమంది నోళ్ళల్లో నానుతూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లు వచ్చాయంటే చాలు పారితోషకాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది.


 ఇక అందరూ సినీ సెలబ్రిటీల లాగానే ఇక ఇప్పుడు మంగ్లీ కూడా ఇదే చేస్తుందట. తాను పాడిన అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అవుతూ ఉండడం.. ఇక మంగ్లీతో ఒక పాట పాడించాలని అన్ని సినిమాల దర్శక నిర్మాతలు కూడా వెంటపడుతూ ఉండడంతో.. ఇక ఇప్పుడు పారితోషకాన్ని అమాంతం చేసిందట మంగ్లీ. ఒకప్పుడు ఒక్కోపాటికి 20వేల రూపాయల పారితోషకం తీసుకున్న మంగ్లీ.. ఇక ఇప్పుడు రెండు నుంచి మూడు లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. ఇక మంగ్లీ పాటలు హిట్ అవుతుండడంతో నిర్మాతలు ఇంత మొత్తంలో చెల్లించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదట. ఇక మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె సొంతంగా నిర్మించిన పాటలను కూడా విడుదల చేస్తుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: