తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అదిరిపోయే రేంజ్ లాభాలను అందుకున్నాయి. అలా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి అత్యధిక లాభాలను అందుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రూపొందిన బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 508 కోట్ల లాభాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అత్యధిక లాభాలను అందుకున్న సినిమాల వరసలో టాప్ స్థానంలో నిలిచింది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

బాహుబలి 1 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా , అనుష్క హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల లాభాలను అందుకుంది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 163.03 కోట్ల లాభాలను అందుకుంది. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు .

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా ప్రపంచవ్యాప్తంగా 75.88 కోట్ల లాభాలను అందుకుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దల కొండ గణేష్ మూవీ కి 55.43 కోట్ల లాభాలు దక్కాయి. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: