మహేష్ చేసిన మంచి సినిమాల్లో నిజం సినిమా కూడా ఒకటి. కానీ కమర్షియల్ గా ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ నటన పరంగా మాత్రం మహేష్ బాబు రేంజ్ పెంచింది.

ఈ సినిమాకి  మహేష్ బాబు నటన కి నంది అవార్డు కూడా లభించింది.అయితే ఈ సినిమా లో మహేష్ బాబు హత్యలు చేసుకుంటూ పోతుంటే అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సినిమా చాలా కీలకమైన క్యారెక్టర్ అవ్వడం వల్ల ఈ క్యారెక్టర్ ని ముందు సీనియర్ నటుడు అయిన మురళి మోహన్ గారి చేత చేయించారట.ఎన్ని టేకులు చేసిన కానీ ఒక్క షాట్ కూడా సరిగ్గా వచ్చేది కాదట దాంతో విసిగిపోయిన మురళి మోహన్ నీకు ఇంకా ఎలా కావాలో చెప్పు అలా చేస్తా అని కూడా అన్నాడట కొన్ని సందర్భాల్లో మురళి మోహన్ సీనియర్ నటుడు అని కూడా చూడకుండా తేజ తిట్టాడని సమాచారం.దాంతో మురళి మోహన్ తీవ్ర మనస్థాపానికి గురై పెద్దవాళ్ళంటే గౌరవం కూడా లేని ఆయన సినిమాలో నేను అస్సలు చేయలేను అని కూడా చెప్పారట.

దాంతో ఈ సినిమాలో మురళి మోహన్ గారి స్థానంలో ప్రకాష్ రాజ్ గారిని పెట్టి షూటింగ్ చేసారట..అయితే ఈ సినిమా బాక్సఫీస్ దగ్గర ప్లాప్ అయినప్పటికి కూడా మహేష్ బాబు బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చిన 5 సినిమాల లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉంటుంది...ప్రస్తుతం తేజ ఒక్క హిట్ కోసం బాగా ఎదురుచూస్తున్నాడు అందులో భాగంగానే సురేష్ బాబు కొడుకు అయిన అభి రామ్ తో అహింస అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమాతో మళ్లీ తేజ ఫామ్ లోకి వస్తారని వారి అభిమానులు ఆశిస్తున్నారు... ఈ సినిమా  హిట్ అయితే నెక్స్ట్ పెద్ద సినిమా చేసే అవకాశం కూడా ఉంది.అయిన తేజ కెరియర్లో స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నపటికీ ఆయన కావాలనే ఆ ఛాన్స్ లని వదిలేసాడు ఎందుకంటే తనకి స్టార్లని డైరెక్ట్ చేయడం కంటే యంగ్ హీరోలని కొత్త వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటేనే చాలా ఇష్టం అని చెప్పారు ఎందుకంటే వాళ్ల మీద అయితే ఎలాంటి అంచనాలు ఉండవని ఆయన నమ్మకం.…

మరింత సమాచారం తెలుసుకోండి: