‘ఫిదా’ మూవీ సూపర్ సక్సస్ తరువాత సాయి పల్లవి క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతుంది అన్న అంచనాలు వచ్చాయి. అయితే ఆమూవీ తరువాత సాయి పల్లవి మంచి నటిగా పేరు తెచ్చుకునే పాత్రలలో నటించి మెప్పించగలిగింది కాని హీరోయిన్ గా టాప్ రేంజ్ కి ఆమె చేరుకోలేక పోయింది అన్న కామెంట్స్ వచ్చాయి.


దీనికితోడు గత సంవత్సరం విడుదలైన ‘విరాటపర్వం’ ‘గార్గి’ సినిమాలలో నటిగా ఆమెకు చాల మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఆసినిమాలు రెండు ఫెయిల్ అవ్వడంతో ఆమె మరో తెలుగు సినిమాకు కమిట్ అవ్వలేదు. కొంతమంది దర్శకులు ఆమెకు కథ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె కనీసం కథలు కూడ వినడానికి ఆశక్తి కనపరచడంలేదు అని వార్తలు రావడంతో ఆమె పెళ్ళి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెపుతుందని కొందరు మరికొందరు ఆమెకు ఆరోగ్యం సరిగ్గాలేక కొత్త సినిమాలు ఒప్పుకోవడంలేదు అంటూ గాసిప్పులు పుట్టించారు.


అయితే ఈ గాసిప్పుల పై కూడ ఆమె వైపు నుండి ఎటువంటి ఖండనా రాకపోవడంతో ఆమెకు ఏమైంది అంటూ చాలామంది సందేహాలు వ్యక్తపరచడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సందేహాలు అన్నింటికి సాయి పల్లవి నుండి సమాధానం వచ్చే కౌంట్ డౌన్ మొదలైంది. ఒకప్పుడు పాప్ సింగర్ గా చలరేగిపోయిన స్మిత ఆతరువాత ఆధ్యాత్మిక బాట పట్టి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని ఛానల్స్ లో ప్రసారం అవుతున్న షోలకు జడ్జిగా తన కెరియర్ కొనసాగిస్తోంది. ఇప్పుడు ఈమె హోస్ట్ గా మారి 'నిజం విత్ స్మిత' అన్న టాక్ షోను మొదలుపెట్టింది. ఈ షోను సోనీ లీవ్ ఓటీటీ లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ టాక్ షోకు సాయి పల్లవి అతిధిగా రాబోతోంది. స్మిత సాయి పల్లవి పై వస్తున్న అనేక రూమర్లకు ఈషోలో ఆమె చేత సమాధానాలు ఇప్పిస్తుంది అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ షో ఈనెల 10వ తారీఖు నుండి స్ట్రీమ్ కాబోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: