ఇటీవల కాలంలో అతి చిన్న సినిమాలుగా వస్తున్న ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇక ఇలాంటి కోవలోకి చెందినదే హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమా. నాచురాలిటీకి ఎంతో దగ్గరగా ఉన్న ఈ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముందుగా కన్నడలో స్టార్ట్ అయిన కాంతారా మేనియా నెమ్మదిగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని వారాహ రూపం అటు సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పాలి. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడిని కట్టిపడేసింది.


 ఇక కాంతారా సినిమా కోసం చేసింది తక్కువ ప్రచారమే అయినప్పటికీ ఏకంగా భారీ బడ్జెట్ సినిమాలను మించి వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఒకసారిగా దర్శకుడు హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది అని చెప్పాలి. తెలుగు తమిళం మలయాళం హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లతో సునామీసుల సృష్టించింది. ఇక ఎన్నో రోజులపాటు అటు సినీ జనాలు కాంతారా జపం చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే 450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం 16 కోట్ల అతి చిన్న బడ్జెట్ తో తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇక ఇప్పుడు కాంతార 2 కి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమవుతుందని ఇక వచ్చే ఏడాది కాంతారా 2 సినిమా విడుదలవుతుంది అని ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వల్ గురించి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికర విషయం వైరల్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కాంతారా 2 కాదు కాంతారా మొదటి పార్ట్ అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనం చూసింది కాంతారా సెకండ్ పార్ట్ అట. ఇలా కాంతారకు సీక్వల్ కాదు ఫ్రీక్వల్ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అసలు కాంతార కథ ఎక్కడ ప్రారంభమైంది.. శివ వాళ్ళ నాన్న కథ ఏంటి అనే విషయాలను ఇక ఈ సినిమాలో చూపించబోతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: