RRR సినిమాతో వరల్డ్ సూపర్ స్టార్ హీరోగా పేరుపొందారు.. అతడే రామ్ చరణ్.. ఇటీవలే లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసినదే.. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఇండియా టుడే నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనీ ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే ఇండస్ట్రీలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న నెపోటిజంపై పలు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగింది. ఒకసారి హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం చాలా కష్టమని తెలిపారు.

ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా ప్రోత్సహిస్తారని.. నెపోటిజం పైన రామ్ చరణ్ స్పందించడం జరిగింది.. నిజం చెప్పాలంటే తనకు ఇప్పటివరకు నెపోటిజం అంటే ఏంటో అర్థం కాలేదని.. ఇటీవల దీని గురించి ఎక్కువగా చాలామంది మాట్లాడుతున్నారని తెలిపారు. బంధుప్రీతి ఉందని భావించే వాళ్ల వల్లే ఇది ఇంతటి చర్చకు దారితీసింది అని తెలుపుతున్నారు. నేను చిన్న వయసు నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను.. నాకు నటన అంటే చాలా ఇష్టము సినిమాని ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలను కూడా కలుస్తూ ప్రాజెక్టు చేస్తున్నాను.  నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లుగా నిలబడిగలిగాను అంటూ తెలుపుకొచ్చారు.


తన తండ్రి వల్లే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను నా ప్రయాణం అలాగే కొనసాగిస్తానని టాలెంట్ లేకపోతే ఈ ప్రయాణం సులభం కాదని సక్సెస్ లేదా ఫెయిల్యూర్.. మీకోసం పనిచేసే వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి అని.. మొదట్లో తన తండ్రి చెప్పే వారని ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానంటూ తెలిపారు రామ్ చరణ్. ఒకవేళ స్టార్ హీరో కొడుకు అయినందున సాధారణ ప్రజలు.. రూ.100 రూ.500 పెట్టి సినిమా చూస్తారు అనుకోవచ్చు అని తెలిపారు. కానీ టాలెంట్ లేకపోతే ఎవరూ చూడరని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: